‘ఆవో-దేఖో-సీకో’.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ..!

తెలంగాణలో ప్రధాన మంత్రి మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ‘ఆవో-దేఖో-సీకో’ అంటూ లేఖలో పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని కోరారు. 

పార్టీ డీఎన్ఏలో విద్వేషాన్ని, సంకుచిత్తం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశేే అని తెలుసని పేర్కొన్నారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. 

అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదన్నారు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభం చేయడానికి తెలంగాణకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదని, తెలంగాణ ప్రాజెక్టులు.. పథకాలు.. సుపరిపాలన విధానాలు ప్రాధాన్యతలను అధ్యయనం చేయాలని సూచించారు. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకాలని, మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి ఆలోచన చేయాలని, కొత్త ఆరంభం వైపు అడుగులు వేయాలని ప్రధాని మోడీకి కేటీఆర్ సూచించారు. 

 

 

Leave a Comment