పేపర్ వేస్తే తప్పేంటీ?.. ఈ బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి కేటీఆర్ ఫిదా.. వీడియో వైరల్..!

కొంత మందికి చిన్నతనం నుంచే బాధ్యతలు మీద పడుతున్నాయి. చదువు మానేసి పనులకు వెళ్లే వారు కొందరైతే.. మరి కొందరు చదువుకుంటూనే ఏదో ఒక పనిచేస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి వచ్చి జీవితాలను తారుమారు చేసేసింది. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని చదువుకుంటూనే పనిచేసుకుంటున్నారు ఎంతో మంది చిన్నారులు.. 

ప్రస్తతం తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ బాలుడి ఆత్మవిశ్వాసానికి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆ బుడ్డోడి భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు. ఈ చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు తను నచ్చాయని చెబుతూ వీడియో షేర్ చేశారు. 

ఇంతకు ఆ బాలుడు ఏమన్నాడంటే..

జగిత్యాల జిల్లాకు చెందిన జై ప్రకాశ్ అనే బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉదయం పూట పేపర్ వేస్తున్నాడు. ఈక్రమంలో ఓ వ్యక్తి జైప్రకాశ్ ను ఆపి ఈ ఏజ్ లో పేపర్ ఎందుకు వేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. వెంటనే ఆ బుడ్డోడు స్పందించి.. ఏం..పేపర్ వేయొద్ద అంటూ ఆ వ్యక్తిని తిరిగి ప్రశ్నించాడు. చదువుకునే వయస్సులో పనిచేస్తున్నావ్ కదా అని ఆ వ్యక్తి అడిగాడు.. దీనికి ఆ బుడ్డుడు వెంటనే ‘చదువుకుంటున్నా.. పనిచే్తున్నా.. దానితో తప్పేముంది’ అని అన్నాడు. ఈ ఏజ్ లో చాలా కష్టపడుతున్నావు అని అడగ్గా.. ‘కష్టపడితే ఏం అయితది.. భవిష్యత్తులో నాకే మేలు చేస్తుంది’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ బుడ్డోడి ఎక్స్ ప్రెషన్స్, కాన్ఫిడెన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ చిన్నారి జైని ప్రశంసిస్తున్నారు.. 

Leave a Comment