చంద్రబాబు నా ఈక ముక్క కూడా పీకలేడు : మంత్రి కొడాలి నాని

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు తన చన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. ఎవరైనా ఆయన గురించి మాట్లాడినా, బయటకు చెప్పినా ఆయన దగ్గర ఉండే ఊర కుక్కలు, పిచ్చి కుక్కలతో సోషల్ మీడియాలో తిట్టిస్తాడని విమర్శించారు. 

పనిపాట లేని వర్లరామయ్య వంటి పనికిమాలిన వారు 10 మంది ఉంటారని నాని పేర్కొన్నారు. ఈటీవీ, ఏబిఎన్, టీవీ-5 లాంటి ఛానల్స్ లో తమ గురించి చాలా గొప్పగా కథలు కథలుగా, అడ్డమైన వాళ్లను పెట్టి బూతులు తిట్టిస్తాడని చెప్పారు. చంద్రబాబు చేసే చిల్లర పనులన్నీ తాను నిక్కర్లు వేసుకున్న దగ్గరుండి చూస్తున్నానని తెలిపారు.

పదవి కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడరని విమర్శించారు. రెండెకరాల పొలం నుంచి రెండు లక్షల కోట్ల వరకు రాష్ట్ర ప్రజల ధనాన్ని ఎలా దోచుకున్నాడో ప్రజలకు చెప్పాలన్నదే తన ఉద్దేశం అన్నారు. ‘చంద్రబాబు నా ఈక ముక్క కూడా పీకలేడు’ అని అన్నారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమాలపై ప్రభుత్వానికి, రాష్ట్రప్రజలకు క్లారిటీ ఉందన్నారు. పొలాల రేట్ల కోసం తానేమి ఉద్యమం చేయట్లేదన్నారు.

 రాష్ట్ర ప్రజలు, పేదలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం చెప్పవద్దని, కోర్టుల్లో కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. కేవలం 29 గ్రామాల సమస్య గురించి రాష్ట్ర అతలాకుతలం అయిపోయిందని కొన్ని టీవీ ఛానల్స్ లో చూపుతున్నారన్నారు. తాము చాలా స్పష్టంగా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పామన్నారు. కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ తత్కాలికంగా ఆగిందన్నారు.  ఆఫ్ నాలెడ్జ్ మేధావులతో కొన్ని టీవీల్లో చర్చా కార్యక్రమాలను పెడుతున్నారని విమర్శించారు. 

 

Leave a Comment