రాసలీల ఆడియో లీక్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి అవంతి..!

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చెందిన ఓ ఆడియో టేపు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి అవంతి ఓ మహిళతో మాట్లాడుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది.  ఇంటికి వస్తే అరగంటలో పంపించేస్తానని, వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మహిళతో ఆయన సంభాషిస్తున్నట్లు ఉన్న ఆడియో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియో తనదికాదని మంత్రి అవంతి తెలిపారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. నకిలీ ఆడియో టేపులు తయారు చేసి సోషల్ మీడియా ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశానని, ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి ఏకైన మంత్రిగా ఉన్న తనపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవని గుర్తు చేశారు.  

వైసీపీకి మహిళల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. తనను ఇబ్బంది పెట్టినవారు ఇబ్బంది పడక తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, నిందితులు ఎవరన్నది త్వరలోనే తేలుతుందని మంత్రి తెలిపారు. తాను రాజకీయంగా తనపై పోటీ చేసిన ప్రత్యర్థులను కూడా మిత్రులుగానే చూసే వ్యక్తినని అన్నారు. దేవుడి ఆశీస్సులుు, ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఎవరూ తన ఎదుగుదలను అడ్డుకోలేరని చెప్పారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.  

Leave a Comment