గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ కామెల్లియా సినెన్సిస్ ఆకుల నుంచి తయారు చేయబడే టీ.. అయితే గ్రీన్ టీ ఎవరు కనుగొన్నారని విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందా.. 

గ్రీన్ గొప్పదనాన్ని ప్రపంచానికి చెప్పింది మాత్రం మిచియో సుజిమురా.. ఈమె ఓ జపనీస్ ఎడ్యుకేషనిస్ట్, బయోకెమిస్ట్.. గ్రీన్ టీలోని పోషక విలువల గురించి తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. జపాన్ లో వ్యవసాయంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న మొదటి మహిళగా మిచియో సుజిమురా రికార్డుకెక్కింది. ఈమె 1888 సెప్టెంబర్ 17న సైతామా రీజియన్ లోని ఓకేగావాలో జన్మించారు.

మిచియో సుజిమురా తన స్కూల్ చదువు పూర్తి చేసుకుని ట్యోక్యో ఇంపీరియర్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేసింది. గ్రీన్ టీపై పరిశోధలే చేసింది. ఈ పరిశోధనల్లో డాక్టర్ ఉమెటారో సుజుకీ ఆమెకు సహకరించారు. అంతే గ్రీన్ లో విటమిన్ బి-1 ఉంటుందని సుజుకీ గుర్తించారు. అనంతరం వీరిద్దరూ మైక్రోస్కోప్ పరిశోధనల్లో గ్రీన్ టీలో విటమిన్ సీని గుర్తించారు. 1929లో గ్రీన్ టీలో ఫ్లవనాయిడ్ కాటెచిన్, 1930లో టానిన్ లు ఉన్నట్లు సుజిమురా గుర్తించింది. ఈ పరిశోధనలను కంబైన్డ్ చేసి ‘ఆన్ ది కెమికల్ కాంపోనెన్ట్స్ ఆఫ్ గ్రీన్ టీ’ పేరుతో థీసిస్ తయారు చేశారు. 

1932లో సుజిమురా వ్యవసాయంలో డాక్టరేట్ పొందారు. టోక్యో హోం ఎకనమిక్స్ యూనివర్సిటీకి మొట్టమొదటి డీన్ గా వ్యవహరించారు. ప్రొఫెసర్ గా పనిచేసి 1955లో రిటైర్డ్ అయ్యారు. 1969 జూన్ 1న 81 ఏళ్ల వయస్సులో ఆమె కన్నుమూశారు. ఆమె జ్ఞాపకార్థం ఓకేగావా సిటీలో ఆమె పరిశోధనలకు సంబంధించిన విషయాలతో ఒక స్థూపం నిర్మించారు. 

గ్రీన్ టీ ఉపయోగాలు..

  • గ్రీన్ టీలోని ఎపిగాలోకేటెచిన్-3 గ్యాలేట్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. 
  • వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు ముప్పును నివారించవచ్చు.
  • గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లతో గుండె పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదం చేస్తుంది. 
  • కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది. 

ఎప్పుడు తీసుకోకూడదు..

  • గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, లివర్ కి సంబంధించిన సమస్యలు వస్తాయి.
  • గర్భిణీలు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు. 
  • రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తీసుకోకూడదు.
  • గ్రీన్ టీతో మందులు వేసుకోకూడదు.
  • మధ్యాహ్న భోజనం తర్వాత గ్రీన్ టీ సేవిస్తే భోజనం నుంచి లభించే  పోషక విలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.     

Leave a Comment