రెడ్ అలర్ట్ .. అప్రమత్తంగా ఉండండి..!

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా కుండపోత వాన కురుస్తోంది.. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం బలపడిందని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్ కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చయగా, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపెట, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. 

రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లతో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇక అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 

Leave a Comment