ఆ విషయంలో మగవాళ్లే ఎక్కువ బాధపడతారట..!

ప్రేమ లేదా పెళ్లిలో బ్రేకప్ అయితే అది ఎంతో బాధకరమైన విషయం.. ఒక రిలేషన్ బ్రేక్ అయితే మహిళలే ఎక్కువగా బాధపడతారని అనుకుంటాం.. కానీ తాజా అధ్యయనం అది నిజం కాదని చెబుతోంది. లాంకాస్టర్ యూనివర్సిటీ నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో స్త్రీలతో పోలిస్తే మగవాళ్లలోనే ఆ బాధ ఎక్కువగా ఉంటుందని తేలింది. 

బ్రేకప్ విషయంలో యూనివర్సిటీ నిపుణులు అనేక అధ్యయనాలు చేశారు. 1.84 లక్షల మందిని ఎంపిక చేసి ఆన్ లైన్ లో వారి సమస్యలను తెలుసుకున్నారు. ‘నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్’ పద్ధతిని ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా స్పందించారు. 

బ్రేకప్ అవ్వడం వల్ల తాము ఎంత బాధపడిందీ పురుషులు వివరింగా చెప్పారట. కొందరైతే ఆ బాధను తట్టుకోలేకపోయామని ఏడ్చేశారు. దీనిని బట్టి భావోద్వేగాలు మహిళలకు ఉన్నట్లే మగవారికి కూడా ఉంటాయని, మహిళల కంటే మగవారే సున్నత మనస్కులనీ పరిశోధకులు చెప్పారు. దీని అర్థం మహిళలు భావరహితులని కాదని, ఈ విషయంలో మరింత పరిశోధన అవసరమని నిపుణులు భావిస్తున్నారు.  

Leave a Comment