ఆస్పత్రి కట్టిస్తా.. మెగాస్టర్ చిరంజీవి ప్రకటన..!

అమెరికాలోని డల్లాస్ లో సెప్టెంబర్ 24 నుంచి సెటబ్రిటీ క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్, జెర్సీలను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కీలక ప్రకటన చేశారు. చిత్రపురి కాలనీలో తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో ఆస్పత్రి కట్టిస్తానని ప్రకటించారు. ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసి, సేవలు అందించేలా చూస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు.. 

మొదట్లో బాగా సంపాదించాలని, ఆ డబ్బుతో సంతోషంగా జీవితాన్ని గడపాలని ఉంటుందని చిరంజీవి అన్నారు. ఒక దశకు వచ్చాకా ఎదుటివారికి సాయం చేయాలన్న భావన కలుగుతుందన్నారు. తనకు ఇంతటి అభిమానాన్ని అందించి ప్రేక్షకులకు ఏదైనా చేయాలని ఉండేదని, అలా బ్లడ్ బ్యాంక్ స్థాపించానని అన్నారు. తాము ఈ స్థాయిలో జీవిస్తున్నామంటే సినీ పరిశ్రమే కారణమని అన్నారు. అందుకే సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో 10 పడకలతో ఓ ఆస్పత్రిని నిర్మించానుకుంటున్నానని తెలిపారు. 

వచ్చే ఏడాది ఇదే సమయానికి ఆస్పత్రి కార్యక్రమాలు ప్రారంభిస్తానని చిరంజీవి మాటిచ్చారు. ఈ ఆస్పత్రి నిర్మాణంలో ఎవరైనా భాగస్వాములవుతామంటే సంతోషంగా ఆహ్వానిస్తానన్నారు. దానికి ఎన్ని కోట్లు ఖర్చయినా భరిస్తానని అన్నారు. చిరు ప్రకటనతో స్టేజ్ పై ఉన్న తరుణ్, శ్రీకాంత్, తమన్, సుధీర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. 

  

 

 

Leave a Comment