భార్యతో కలిసి రక్తదానం చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

ఒకరి రక్తదానం మరొకరి ప్రాణదానం అవుతుంది.. సమయానికి రక్తం అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం(WorldBloodDonarsDay).. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి రక్తదానం చేశారు. 

‘రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పనితో ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడుతుండటం, ఏ సంబంధం లేని వారికి రక్తం ఇచ్చి వారితో ఓ రక్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అనేది గొప్ప విషయం. రక్త దానం చేయండి.. ప్రాణాల్ని కాపాడండి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులకు పిలుపునిచ్చారు. 

Leave a Comment