ప్రపంచంలోనే అత్యుత్తమ డైట్ ఇదేనట.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..?

మెడిటరేనియన్ డైట్.. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ డైట్ గా ఎంపికైంది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ పలు రకాల డైట్లను పరిశీలించి అత్యుత్తమ డైట్ ని ఎంపికచేస్తుంది. ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు మెడిటరేనియన్ డైట్ ని ఉత్తమ డైట్ గా ఎంపిక చేశారు. గత ఐదేళ్లుగా అత్యుత్తమ డైట్ గా మెడిటరేనియన్ డైట్ ఎంపికవుతూ ఉంది. 

మెడిటరేనియన్ డైట్ ఫాలో కావడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.. డయాబెటీస్, మెమోరీ లాస్, గుండె జబ్బులు, గుండెపోటు, రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో మెడిటరేనియన్ డైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు బరువు ఫాస్ట్ గా తగ్గడంలో ఇది కీలక పాత్ర పోషింస్తుందని అంటున్నారు. 

మెడిటరేనియన్ డైట్ అంటే ఏంటీ?

మొక్కల ఆధారిత ఆహారాన్నే మెడిటరేనియన్ డైట్ అంటారు. పండ్లు, కూరగాయలపై ఎక్కువ దృష్టి పెడతారు. పలు రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, విత్తనాలు ఈ డైట్ లో చేర్చారు. పచ్చి ఆలివ్ నూనెను కొవ్వుగా ఉపయోగిస్తారు. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా చేపలను ఈ డైట్ లో తీసుకుంటారు. ఈ డైట్ లో చక్కెర, రెడ్ మీట్, గుడ్లు, చికెన్, టర్కీ చికెన్, పాల ఉత్పత్తులను తక్కువగా వాడతారు. శుద్ధి చేసిన నూనె ప్రాసెస్ చేసిన ఆహారాలను మెడిటరేనియన్ డైట్ లో నిషేధించారు. ఆల్కహాల్ కూడా పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి.. 

ఈ డైట్ తో ప్రయోజనాలు:

  • గుండె ఆరోగ్యం: గుండె ఆరోగ్యానికి మెడిటరేనియన్ డైట్ చాలా మంచిదట.. ఈ డైట్ పాలో అవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్స్ వంటి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.
  • ఈ డైట్ డిప్రెషన్ ని తగ్గిస్తుంది. ఇతరులతో పోలిస్తే 33 శాతం తక్కువ డిప్రెషన్ కి గురవుతారు. 
  • ఈ డైట్ మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుంది. దీని వల్ల మనసుకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ ముప్పు తగ్గుతుంది.
  • మెడిటరేనియన్ డైట్ ఫాలో కావడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
  • ఈ డైట్ లో ఉండే పోషకాలు ఎముకల జీవక్రియను పెంచుతాయి. ఇది స్త్రీలలో ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది.
  • ఈ డైట్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం తగ్గుతుందట.
  • టైప్-2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ డైట్ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అంతేకాదు వేగంగా బరువు తగ్గడం, అంగస్తంభన లోపాన్ని సవరించుకోవడం, చిత్తవైకల్యం తగ్గించుకోవడానికి ఈ డైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.   

 

Leave a Comment