ఛీ..ఛీ.. సొంత చెల్లెలిపైనే అన్న అత్యాచారం.. బాలిక గర్భం దాల్చడంతో..!

ఇటీవల కాలంలో కొందరు కామంతో కళ్లుమూసుకుపోయి వావి వరుసలు మరిచిపోతున్నారు. అమ్మాయి కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. తాజాగా సొంత చెల్లెలిపైనే అన్న అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాల మేరకు ఓ కుటుంబం కేరళ నుంచి వలస వచ్చి బాచుపల్లి పరిధిలోని ఓ కాలనీలో నివాసం ఉంటోంది. భర్త వ్యాపారం చేస్తుండగా.. భార్య ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 17 ఏళ్ల కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. 13 ఏళ్ల కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. 

అన్న చెల్లెలు ఇద్దరు ఒకే గదిలో నిద్రపోయేవారు. ఈక్రమంలో చెల్లిలిని లోచరుచుకున్నాడు అన్న. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఓరోజూ బాలికకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో మాదాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లు తేలింది.

ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలికకు అబార్షన్ చేయించాలని అనుకున్నారు. దానికోసం ఈస్ట్ మారేడ్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతికి తీసుకెళ్లారు. బాలిక మైనర్ కావడంతో వైద్యులకు అనుమానం వచ్చింది. విషయాన్ని మేడ్చల్ జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి సమాచారం అందించారు. అధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్ కి తరలించారు.      

Leave a Comment