మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన మాస్టర్ భువన్..!

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన మాస్టర్ గంధం భువన్ జై చరిత్ర సృష్టించాడు. యూరోప్ ఖండంలోని ఎత్తయిన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించాడు. కేవలం 8 సంవత్సరాల 3 నెలల వయసులోనే ఈ శిఖరాన్ని అధిరోహించి అతి చిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. 5642 మీటర్ల ఎత్తు కలిగి ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం అయిన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని 3వ తరగతి విద్యార్థి భవన్ సెప్టెంబర్ 18న అధిరోహించాడు. ఏమాత్రం అనుకూలతలేని భిన్నమైన వాతావరణంలో, ఎంతో శ్రమ చేసి భవన్ ఈ ఘనత సాధించాడు.

భువన్ జై ఎవరో కాదు సీనియర్ ఐఏఎస్ అధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు కుమారుడు.. భువన్ కు ఆటలంటే చాలా ఇష్టం.. అలాగే పర్వతారోహణలో కూడా ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు అనంతపురానికి చెందిన స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద శిక్షణ ఇప్పించారు.    

Leave a Comment