మీరు ఆ క్రిప్టో కరెన్సీ పై ఇన్వెస్ట్ చేశారా?.. కోట్ల రూపాయలతో సృష్టికర్త జంప్..!

స్టాక్ మార్కెట్ ఫాలో అయ్యే వారికి క్రిప్టో కరెన్సీ గురించి చెప్పాల్సిన పనిలేదు.. క్రిప్టో కరెన్సీ అనేది ఓ డిజిటల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీ అనేది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టో కరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టో కరెన్సీ పచిచేస్తాయి. క్రిప్టో కరెన్సీలో ఎన్ని రకాల కరెన్సీలు ఉన్నాయి. బిట్ కాయిన్, ఇథీరియమ్, డాష్, మొనెరో, రిపుల్, లైట్ కాయిన్ అనేవి ప్రముఖ క్రిప్టో కరెన్సీలుగా కొనసాగుతున్నాయి. 

అయితే ఈ క్రిప్టో కరెన్సీలు సేఫేనా అనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కోట్ల మంది ఇన్వెస్టర్ల సంపద ఒక్క దెబ్బకు ఆవిరై పోయింది. కాయిన్ స్టార్ట్ అయిన నాటి విలువ కంటే అట్టడుగుకు చేరింది. అదే ‘స్క్విడ్ గేమ్’ కాయిన్(squid game crypto).. ఈ కాయిన్ అక్టోబర్ 10న ప్రారంభమైంది. ఈ కాయిన్ ప్రారంభమైనప్పటి నుంచి భారీ లాభాలను ఆర్జించింది. అయితే ఈ కాయిన్ ఈ మంగళవారం ఒక్కసారిగా భారీగా పతనమైంది. 

కారణం ఏంటంటే..

ఈ క్రిప్టో కరెన్సీని వర్చువల్ గా సృష్టిస్తారు. ఈ వర్చువల్ సృష్టికర్తలు స్క్విడ్ గేమ్ కాయిన్ విలువ పతాక స్థాయికి చేరిన తర్వాత వారి షేర్లను అమ్మేశారు.. దీంతో ఈ కాయిన్ విలువ సడెన్ గా పడిపోయింది. ప్రారంభంలో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు. సోమవారం ఉదయం 2,800 డాలర్లుగా ఉన్నకాయిన్ విలువ ఒక్కసారిగా 0.005 డాలర్లకు చేరింది. 

 

Leave a Comment