మాస్క్ సరిగా పెట్టుకోలేదని.. ఆటో డ్రైవర్ ను చితకబాదిన పోలీసులు..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కరోనా నిబంధనలను పాటించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 

దీనిని సాకుగా తీసుకున్న ఇద్దరు పోలీసులు విచక్షణ కోల్పోయి ఓ ఆటో డ్రైవర్ పై తమ ప్రతాపం చూపించారు. మాస్క్ సరిగా పెట్టుకోలేదని నడిరోడ్డుపై కింద పడేసి అతి దారుణంగా చితకబాదారు. ఆటో డ్రైవర్ కృష్ణ కెయర్(35) అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్తున్నాడు. ఈ సమయంలో అతడు మాస్క్ సరిగా పెట్టుకోలేదు. ఇది గమనించిన ఇద్దరు పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను ఆపి, పోలీస్ స్టేషన్ కు రావాలన్నారు. అయితే ఆటో డ్రైవర్ అందుకు నిరాకరించాడు. దీంతో ఆ ఆటో డ్రైవర్ ను అందరు చూస్తుండగానే కిందపడేసి చితకబాదారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment