తాళి కట్టే సమయంలో వరుడి విగ్గు ఊడింది.. పెళ్లి ఆగిపోయింది..!

పెళ్లికి అంతా సిద్ధంగా ఉంది. తాళి కట్టే ముందు జరగాల్సిన తతంగం కూడా పూర్తి అయ్యింది. వధూవరులు ఇద్దరు మండపంపై కూర్చునే సమయంలో.. సీన్ మారిపోయింది. వరుడి బండారం బట్టబయలు కావడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో చోటుచేసుకుంది. 

సఫీపూర్ కొత్వలి ప్రాంతానికి చెందిన నిషాకు కాన్పూర్ కి చెందిన పంకజ్ తో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 20న స్థానిక గెస్ట్ హౌస్ లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి అంతరా సిద్ధంగా ఉంది. వధువు, వరులు ఇద్దరు మండపంపైకి వెళ్తున్నారు. ఇంతలో వరుడు స్పృహ తప్పి కిందపడిపోయాడు. దీంతో వధువు బంధువులు వరుడి ముఖంపై నీళ్లు చల్లి కూర్చొబెట్టారు. 

ఆ సమయంలో పెళ్లి కొడుకు టోపీతో పాటు విగ్గు కూడా ఊడి కింద పడింది. ఇది చూసి వధువుకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాబోయే భర్తకు బట్టతల ఉందని తెలుసుకున్న ఆ వధువు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. ఈ విషయం ముందే చెప్పి ఉంటే బాగుండేదని, దాచి పెట్టి మోసం చేశారని వధువు తరఫు వారు నిలదీశారు. 

ఈ వాగ్వాదం అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు కొనసాగింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు కుటుంబాలను కూర్చోబెట్టి సెటిల్ చేశారు. వధువు తరఫున బంధువులు పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోవడంతో చేసేది లేక క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. 

వరుడి తల్లిదండ్రుల నుంచి రూ.6 లక్షలు డిమాండ్ చేశారు వధువు తండ్రి.. పోలీసులు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేలా వరుడి కుటుంబాన్ని ఒప్పించారు. మూర్చ వ్యాధితో పాటు వరుడికి బట్టతల ఉన్న విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తున్నారని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం ముందే చెప్పి ఉంటే తమ అమ్మాయిని మానసికంగా సిద్ధం చేసే వాళ్లమని, అందరి ముందు ఇలా జరగడం బాధగా ఉందని చెెప్పారు. 

 

 

 

Leave a Comment