ఇంటర్ లో గ్రేడింగ్ తో పాటు మార్కులు

పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు యాప్

విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్

అమరావతి : ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 తేదీ వరకు 20 రోజుల పాటు జరుగుతాయని,  1411 పరీక్ష కేంద్రాల్లో 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు.  6 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,900 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతుందన్నారు. పరీక్ష సమయంలో స్థానికంగా ఉండే జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. 1400 ఇంటర్, 2900 పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసినందున విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

హాల్ టికెట్ లు వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ప్రతి హాల్ టికెట్ పైనా క్యూ ఆర్ కోడ్ ఉంటుందని అన్నారు. పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ యాప్ ను సిద్ధం చేశామన్నారు. విద్యార్థులు కూర్చునే వెసులుబాటు కల్పించామన్నారు. కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష పత్రాలు లీకేజీ లేకుండా ఉండేందుకు చీఫ్ సూపర్ వైజర్ మినహా ఎవరి వద్ద కూడా మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇంటర్ లో గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇస్తామన్నారు. లేకుంటే పొరుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 

Leave a Comment