చెల్లిని చూసుకూంటూ.. రోజూ పాఠశాలకు 10 ఏళ్ల బాలిక..!

సాధారణంగా చిన్న పిల్లలకు అన్ని పనులు అమ్మే చేసి పెడుతుంది.. స్కూల్ కి రెడీ చేయాలన్నా.. టిఫిన్ సిద్దం చేయాలన్నా అన్ని అమ్మే.. ఎందుకంటే వారు తమ పనులను తాము చేసుకోలేరు.. కానీ మణిపూర్ లోని తామెంగ్లాంగ్ జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలిక మాత్రం అలా కాదు.. తాను స్కూలుకు వెళ్లడంతో పాటు చెల్లిని కూడా చూసుకుంటోంది.. తన చెల్లిని తీసుకుని రోజూ స్కూల్ కి వెళ్తోంది..

ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో.. పదేళ్ల బాలిక మీనింగ్సన్లియు పమీ తన సోదరిని తీసుకొని రోజూ పాఠశాలకు వెళ్తోంది..తరగతి గదిలో చెల్లిని ఎత్తుకునే పాఠాలు వింటోంది. చెల్లిని ఎత్తుకుని పాఠాలు వింటున్న బాలిక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అలా ఆ ఫొటో రాష్ట్ర వ్యవసాయ మంత్రి తోంగమ్ బిశ్వజిత్ సింగ్ వద్దకు చేరింది. దీంతో ఆయన ఆ ఫొటోను ప్రధాని మోడీకి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘ఆ చిన్నారిని ఇంపాల్ కు పిలిపించాం. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు బాధ్యత తీసుంటామని తల్లిదండ్రులకు చెప్పాం’ అని బిశ్వజిత్ సింగ్ పేర్కొన్నారు.    

Leave a Comment