ఆడపిల్లలు పుట్టారని వేధింపులు.. తండ్రికి వీడియో మెసేజ్ పెట్టి మహిళ ఆత్మహత్య..!

ఆడపిల్లలు పుట్టారని భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.. తండ్రికి వీడియో మెసేజ్ పెట్టి తన బాధను వివరించింది.. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ కి చెందిన మన్ దీప్ కౌర్ కి రంజోధ్ బీర్ సింగ్ సంధుతో 2015లో వివాహం అయ్యింది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఇద్దరూ అమెరికాలోని న్యూయార్క్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. 

 

ఆడపిల్లలు పుట్టారని మన్ దీప్ కౌర్(30) ని భర్త వేధింపులకు గురిచేసేవాడు.. రోజూ కొట్టేవాడు.. 50 లక్షలు అదనపు కట్నం కావాలని, కొడుకు కవాలని వేధించేవాడు.. దీంతో మన్ దీప్ ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు భర్త, అత్తమామలను బాధ్యులను చేసింది. చనిపోవడానికి ముందు ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది..

 

‘పెళ్లి అయినప్పటి నుంచి నా భర్త నన్ను కొట్టేవాడు. అమెరికా వెళ్లిన తర్వాత అంతా మారిపోతుందని అనుకున్నా.. కానీ అది జరగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజూ మద్యం తాగి కొట్టేవాడు. ఆత్మహత్య చేసుకోవాలని నా భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. నాన్నా.. నేను చనిపోతున్నా.. నన్ను క్షమించండి.. ఏదో ఒకరోజు మారుతాడని ఎనిమిదేళ్లుగా ఇదంతా సహించాను. కానీ అలా జరగలేదు. నన్ను మూడు రోజుల పాటు బందీగా చేసి కొట్టారు. దీంతో నా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయాలను అనుకున్నారు. అయితే క్షమాపణలు కోరడంతో.. నేనే కాపాడా.. అయినా అతడిలో మార్పు రాలేదు. ఇక తట్టుకోలేను’.. అంటూ వీడియోలో మన్ దీప్ కౌర్ చెప్పుకొచ్చింది.. 

 

Leave a Comment