ఎంత మూర్ఖత్వం.. భార్యకు శీల పరీక్ష.. సలసల కాగే నూనెలో చేయి పెట్టించిన భర్త..!

కాలం మారినా మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు. ఓ మూర్ఖుడు తన భార్యను శీలవతిగా నిరూపించుకోవాలంటూ అగ్ని పరీక్ష పెట్టాడు ఓ భర్త.. సలసల కాగే నూనెలో చేయి పెట్టించాడు. పెన్నంలో ఐదు రూపాయల కాయిన్ వేసి తీయమన్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉస్మాన్ బాద్ లో చోటుచేసుకుంది. 

ఏం జరిగిందంటే.. ఇటీవల భార్యభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న భార్త, తన భార్య కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. నాలుగు రోజుల తర్వాత భార్య ఇంటికి తిరిగి వచ్చింది. 

అయితే గొడవ పెట్టకుని బయటకు వెళ్లిన రోజున ఉస్మాన్ బాద్ లోని పరాండలో ఖాచపూరి బస్టాప్ దగ్గర బస్ కోసం నిల్చున్నానని, అప్పుడు ఇద్దరు వ్యక్తులు బైక్ పై తనను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపింది. నాలుగు రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకున్నారని, ఎలాగో అక్కడి నుంచి బయటపడి తిరిగి వచ్చానని చెప్పింది. అయితే వారు తనను ఏం చేయలేదని తెలిపింది. 

దీంతో తన భార్య చెప్పేది నిజమా కాదా? తెలసుకునేందుకు ఆమెకు అగ్నిపరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వారి కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం సలసల కాగే నూనెలో 5 రూపాయల కాయిన్ వేసి తీయమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ని పరీక్ష పేరుతో మహిళలను వేధిస్తూ, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర లెగిస్టేటివ్ కౌన్సిల్ చైర్మన్ నీలం గోర్హే రాష్ట్ర హోంశాఖను డిమాండ్ చేశారు. 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.