సెక్స్ చేస్తుండగా చనిపోయిన 28 ఏళ్ల యువకుడు.. నిపుణులు ఏమంటున్నారు? 

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. నాగ్ పూర్ కి చెందిన 28 ఏళ్ల యువకుడు తన ప్రియురాలితో సెక్స్ చేస్తుండగా చనిపోయాడు.. ఆ సమయంలో గుండెపోటు రావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటన ఆదివారం నాగ్ పూర్ జిల్లా సావోనర్ లో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన అందరనీ ఆందోళనకు గురిచేస్తోంది.. గుండెపోటుకు, సెక్స్ కి మధ్య సంబంధం గురించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది.

సావోనర్ లోని ఓ లాడ్జికి అజయ్ పార్టేకి అనే యువకుడు మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో నర్సుగా పనిచేసే తన ప్రియురాలితో కలిసి వెళ్లాడు. లాడ్జిలో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో పార్టేకి ఉన్నట్టుండి స్పృహ కోల్పోయినట్లు అతడి ప్రియురాలు పోలీసులకు తెలిపింది. ఈ సందర్భంగా ఎలాంటి డ్రగ్స్ సంబంధించిన ఆధారాలు కూడా కనుగొనలేదని పోలీసులు తెలిపారు.  అజయ్ పార్టేకి వృత్తిరీత్యా డ్రైవర్ మరియు వెల్డింగ్ టెక్నీషియన్. ఈ ఘటన ముఖ్యంగా యువకుల్లో అలారం మోగినట్లు అయ్యింది. 

నిపుణులు ఏమంటున్నారు?

  • సెక్స్ అనేది ఒక సహజమైన చర్య. ఒక రకమైన ఏరోబిక్ వ్యాయామం లాంటిది. ఆరోగ్యవంతమైన గుండె ఉన్న వ్యక్తులకు ఆ సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉండదు.. 
  • లైంగిక కార్యకలాపాలు మీ హృదయ స్పందన రేటును పెంచుతాయి. మెట్లు ఎక్కడం.. జాగింగ్ చేయడం.. ఒక మైలు దూరం నగవగలిగితే.. సురక్షితంగా సెక్స్ చేసుకోవచ్చు. 
  • ఎవరికైనా ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వంటివి ఉంటే.. వారు సెక్స్ తో సహా తీవ్రమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.
  • లైంగిక కార్యకలపాల సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ. వారినికి ఒకసారి సెక్స్ చేసే ప్రతి పది వేల మందిలో.. కేవలం 2 నుంచి 3 మంది మాత్రమే గుండెపోటుకు గురవుతారు. 

 

 

 

Leave a Comment