ఫుల్ బాటిల్ ప్రాణం తీసింది..!

ఇద్దరు మిత్రులు సరదా కోసం వేసుకున్న పందెం ఒకరి ప్రాణం తీసింది. మద్యం బాటిల్ లో సోడా, నీరు కలపకుండా తాగాలని ఇద్దరు మిత్రలు కాసిన పందెంలో ఒకరు మరణించారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శాంతి నగర్ లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎస్.సాయిలు(40) తన ఐదుగురు మిత్రులతో కలిసి పట్టణ శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లారు. అక్కడ అందరూ కలిసి సరదాగా మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటున్నారు. 

మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడి మధ్య వాదన జరిగింది. ఈ వాదన పెరిగడంతో ఇద్దరు పందేనికి దిగారు. సోడా, వాటర్ కలుపుకోకుండా ఫుల్ బాటిల్ తాగేందుకు పందెం కాశారు. ఇద్దరు సోడా, నీరు కలపకుండా ఫుల్ బాటిల్ తాగేశారు. తర్వాత ఇద్దరు కూడా మత్తులోకి జారుకున్నారు. దీంతో తోటి మిత్రులు వీరిని ఇళ్లకు పంపించారు. 

అయితే సాయిలు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సాయిలు మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

Leave a Comment