భార్య కాపురానికి రాలేదని ముక్కు కొరికేసిన భర్త..!

భార్య కాపురానికి వచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ముక్కు కొరికేశాడు భర్త.. ఈ ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది.. ఢిల్లీకి చెందిన విజేందర్ పాల్(36), ప్రేరణ సైనీ(31) భార్యాభర్తలు. వారికి 11 ఏళ్ల కూతురు ఉంది. ఇటీవల ఇద్దరు దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. 

తన భార్య మరొకరితి వివాహేతర సంబంధం పెట్టుకుందని విజేందర్ అనుమానం పెంచుకున్నాడు.. అప్పటి నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులను తట్టుకోలేని ప్రేరణ కూతురును తీసుకొని భర్తకు తెలియకుండా ముంబైలోని బంధువుల ఇంటికి వెళ్లింది. 

అయితే భార్యను వెతుక్కుంటూ విజేందర్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్దామని భార్యను కొరాడు. అందుకు ప్రేరణ నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన విజేందర్ భార్య ముక్కు కొరికి పారిపోయాడు. బలంగా కొరకడంతో ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు 15 కుట్లు వేశారు. 

భార్య ముక్కు కొరికి పారిపోతున్న విజేందర్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా తనకు తన భార్య, కూతురు అంటే చాలా ఇష్టమని, వారిని విడిచి ఉండలేనని చెప్పాడు. ఇంటికి వెళ్దాం రమ్మని ఎంత బతిమాలినా వినలేదని, దీంతో క్షణికావేశంలో ముక్కు కొరికానని విజేందర్ పోలీసుల విచారణలో తెలిపాడు..

 

Leave a Comment