రూ.5 తక్కువ ఇచ్చాడని.. వ్యక్తిని దారుణంగా కొట్టిన హోటల్ యజమాని..వీడియో వైరల్..!

146
Odisha Hotel Owner

ఎక్కడైనా హోటల్ లో భోజనం చేశాక కస్టమర్ వద్ద డబ్బులు తక్కువగా ఉంటే వారితో వాదిస్తారు.. లేక డబ్బులు తిరిగి తెచ్చియమని చెబుతారు. కానీ ఈ హోటల్ యజమాని మాత్రం కస్టమర్ డబ్బులు తక్కువ ఇవ్వడంతో అతడిని చితకబాదాడు. అందరూ చూస్తుండగానే హోటల్ బయటకి తీసుకొచ్చి కొట్టారు. ఇంతకు కస్టమర్ ఎంత తక్కువ ఇచ్చాండే కేవలం 5 రూపాయలు.. ఐదు రూపాయల కోసం ఆ వ్యక్తిని విచక్షణరహితంగా కొట్టారు. ఈ ఘటన ఓడిశాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు హోటల్ యజమాని, అతని కొడుకుపై కేసు నమోదు చేశారు.

కియోంఝర్ జిల్లాకు చెందిన జితేంద్ర దేహురి అనే వ్యక్తి ఘసీపూర్ లోని ‘మా’ హోటల్ కు వెళ్లి ప్లేట్ భోజనం చేశారు. హోటల్ యజమాని మధుసాహు ఆ వ్యక్తికి రూ.45 చెల్లించాలని చెప్పాడు. అయితే తన వద్ద రూ.40 మాత్రమే ఉన్నాయని, మళ్లీ వచ్చినప్పుడు మిగతా డబ్బులు ఇస్తానని దేహురి హోటల్ యజమానితో అన్నాడు. దీంతో హోటల్ యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రూ.45 చెల్లించాల్సిందే అని పట్టబట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

ఈక్రమంలో అప్పటికే అక్కడికి వచ్చిన తన కుమారుడితో కలిసి మధుసాహు దేహురిపై దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే ఇద్దరు కలిసి కస్టమర్ ను దారుణంగా కొట్టారు. అనంతరం బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి హోటల్ యజమానిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే హోటల్ యజమాని కొడుకు మైనర్ కావడంతో అతడిని వదిలేశారు.   

  

 

Previous articleగర్భిణీ భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన భర్త..!
Next articleటీని ఇలా చేసి తాగితే చాలా ప్రమాదం తెలుసా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here