నెల్లూరు జిల్లాలో దారుణం.. వ్యభిచారం చేయాలంటూ యువతిపై దాడి.. వీడియో వైరల్..!

166
Nellore

దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడులను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా కొందరు నీచులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యభిచారం చేయాంటూ ఓ వ్యక్తి యువతిపై కర్రతో చితకబాదాడు. కొట్టవద్దని బ్రతిమిలాడినా కనికరించకుండా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. దాడి చేసిన వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తి జిల్లలోని రామకోటయ్య నగర్ కు చెందిన వెంకటేష్ గా గుర్తించారు. వీడియో తీసిన శివ కుమార్ ని  కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇతరులతో వ్యభిచారం చేయాలంటూ యువతిని వెంకటేష్ అనే వ్యక్తి కర్రతో కొట్టాడు. ఆమె చేతి గాజులు పగిలి రక్తం కారుతున్నా ఆ నీచుడు కనికరించలేదు. నేను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానని బెదిరించాడు. తమ వాళ్లు చేస్తే బాధపడతారని ప్రాధేయపడినా వినలేదు. అడ్డుకుంటే దుస్తులు చించేస్తానని బెదిరించాడు. పైగా మరో వ్యక్తితో వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరలై పోలీసుల వరకు వెళ్లింది. 

దీంతో పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా బాధితురాలికి 18 రోజుల క్రితమే పెళ్లి అయింది. ఈ దాడి మూడు నెలల కింద జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. 

 

Previous article‘బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’.. చిన్నారి హత్యాచారంపై నాని షాకింగ్ ట్వీట్..!
Next articleరోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here