లవర్ పెళ్లికి వెళ్లి తాళి లాగేసుకున్న ప్రియుడు..!

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో వింత ఘటనలు జరుగుతున్నాయి. పెళ్లి సమయానికి ప్రేయసి లేదా ప్రియుడు వెళ్లి వివాహం ఆపేయడం చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటనే జరిగింది. ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రియుడు పూజారి నుంచి తాళిబొట్టును లాగేసుకున్నాడు. బలవంతంగా తన ప్రేయసికి తాళి కట్టేందుకు ప్రయత్నించాడు.. ఈ ఘటన తొందియర్ పేట్ లోని నేతాజీ నగర్ లో జరిగింది.. 

ఏం జరిగిందంటే.. ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేయసికి వేరే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతుండగా.. కరెక్ట్ గా తాళిబొట్టు కట్టే సమయానికి ప్రియుడు వచ్చి పూజారి నుంచి మంగళసూత్రం లాగేసుకున్నాడు. బలవంతంగా వధువుకు తాళి కట్టాలని చూశాడు..

ఇంతలో వధువు కుటుంబ సభ్యులు వచ్చి అతడిని వెనక్కి లాగేశారు. ఏం జరిగిందో తెలీక అక్కడ ఉన్న వారందంరూ షాక్ అయ్యారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే..ఆ యువకుడికి ఆ వధువే మెసేజ్ చేసిందట. ‘వచ్చి నన్ను తీసుకెళ్లు’ అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చూశాకే ఆ యువకుడు అక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పెళ్లి ఆగిపోయింది. 

Leave a Comment