హైదరాబాద్ లో దారుణం.. ఆవు దూడపై అత్యాచారం..!

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు చిన్నారులను, చివరికి మూగజీవాలను సైతం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజయ్ వర్మ అనే వ్యక్తి ఎల్బీనగర్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం సంజయ్ ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంజయ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  ఆవు దూడపై అత్యాచారం చేసిన సంజయ్ వర్మను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  

 

Leave a Comment