భార్య లావుగా ఉందని…ఇంటి నుంచి గెంటేసిన భర్త.!

లావుగా ఉందని భార్యను ఇంటి నుంచి గెంటేశాడు ఓ శాడిస్టు భర్త.. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు అహ్మదాబాద్ లోని మహిళా వెస్ట్ పోలస్ స్టేషన్ పరిధిలోని పస్న రెసిడెంట్ కు చెందిన ఓ మహిళ 2017లో వివాహం చేసుకుంది. వివాహం జరిగిన మొదటి ఆరు నెలలు వారు ఆనందంగా ఉన్నారు. 

ఆ తర్వాత భార్య లావుగా ఉందని, ఆమెపై ఇష్టం కలగడం లేదని వేధించడం మొదలుపెట్టాడు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తన తల్లిదండ్రుల బలవంతంతోనే పెళ్లి చేసుకున్నానని చెప్పేవాడు. ఒక నెల క్రితం కొత్త ఇల్లు కొనేందుకు ఆమె వద్ద నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Leave a Comment