కరెంటు బిల్లులు అలా ఎందుకు ఎక్కువ వచ్చాయో మీరే చెక్ చేసుకోండి..

ఈనెల మీకు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందా? ప్రతి నెల వచ్చిన దానికంటే రెట్టింపు వచ్చిందా? అసలు మీకు అంత బిల్లు ఎందుకు వచ్చింది..ఎలా వచ్చిందనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి. 

 ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ బిల్లులపై గందరగోళం నెలకొంది. విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ బిల్లులు ఎవరూ చెల్లించవద్దు..ప్రభుత్వం బిల్లులు పెంచి వేసి ప్రజల నడ్డి విరిస్తోంది..అని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని విద్యుత్ అధికారులు కొట్టిపారేశారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్ తీయడం వల్లే శ్లాబు రేట్లు పెరిగి ఎక్కువ బిల్లులు వచ్చాయంటూ స్పష్టం చేశారు. అయితే బిల్లింగ్ మాత్రం ఏ నెలకు ఆ నెలే వేశామని చెబుతున్నారు. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీ విద్యుత్ బిల్లును మీరే తనఖీ చేసుకోవచ్చని సూచించారు. 

విద్యుత్ బిల్లులు ఎలా వేస్తారు..

విద్యుత్ బిల్లులను ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీలలో వేస్తారు. 75 యూనిట్లలోపు వినియోగం ఉంటే ఏ కేటగిరిలో ఉంటారు. 225 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉంటే బీ కేటగిరి కింద లెక్కిస్తారు. 225 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లు వినియోగించే వారు సీ కేటగిరిలో ఉంటారు. 

apspdlc

మీ విద్యుత్ బిల్లును ఇలా చెక్ చేసుకోండి..

విద్యుత్ బిల్లుకు సంబంధించి వివరాలను, అసలు బిల్లు ఎలా వేశారు.. ఎన్ని యూనిట్లు వినియోగించారు..ఆ యూనిట్లకు ఎంత బిల్లు వచ్చింది, ఏ యూనిట్ శ్లాబ్ రేటు ప్రకారం ఇచ్చారు..అని పూర్తి వివరాలను ఈ చిన్న ప్రక్రియ ద్వారా స్వయంగా మీరే తెలుసుకోవచ్చు. దాని కోసం ఈ కింద దశలను ఫాలో అవ్వండి.

  • మొదటగా మీరు www.apspdcl.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. 
  • అక్కడ కుడి వైపు పైన ‘’View Your Bill’’ పైన క్లిక్ చేయండి. 
  • అక్కడ మీ 13 అంకెల సర్వీస్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. 
  • అందులో కింది భాగాన ఉన్న Current Month Bill Details ని క్లిక్ చేయాలి. 
  • అంతే మీ విద్యుత్ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయి. 

Leave a Comment