Mahesh Babu: తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన మహేష్ కొడుకు గౌతమ్..!

తన తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు మహేష్ బాబు కొడుకు గౌతమ్.. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్-8 ఈతగాళ్ల లిస్ట్ లో స్థానం సంపాదించాడు. 15 ఏళ్ల వయస్సులోనే గౌతమ్ ఈ ఘనత సాధించాడు. ఇక తన కొడుకు సాధించిన విజయాన్ని మహేశ్ బాబు భార్య నమత్ర సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 

గౌతమ్ నీళ్లలో 5 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చింది. గౌతమ్ బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతడికి ఫ్రీ స్టైల్ అంటే బాగా ఇష్మని చెప్పింది. అలాగే గౌతమ్ ఈత కొడుతున్న ఓ వీడియో క్లిప్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇక ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడని ప్రశంసిస్తున్నారు. 

 

Leave a Comment