Happy Birthday Chiranjeevi: చిరంజీవి బర్త్ డే సర్ ప్రైజ్..‘భోళా శంకర్’గా మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 154వ చిత్రం ‘వేదాళం’ రీమేక్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి ‘భోళా శంకర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూలీ టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ రీమేక్ గా భోళా శంకర్ రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించాడు. 

ఈ తెలుగు రీమేక్ లో ముందుగా పవన్ నటించాల్సి ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీమేక్ ను నాన్చుతూనే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్ లో కనిపించనున్నారు. ఈ సినామా గుండులో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. 

Leave a Comment