భర్త అని నమ్మించి అన్న భార్యపై అత్యాచారం.. కవలలు కావడంతో భర్తే అనుకొని..!

వారిద్దరూ కవల సోదరులు.. చూడ్డానికి అచ్చం ఒకేలా ఉంటారు. వారిని గుర్తించడం ఎదుటివారికి కష్టంగా ఉంటుంది. దీన్నే అవకాశంగా తీసుకున్నాడు ఓ సోదరుడు.. అన్న భార్యతో ఆరు నెలల పాటు అఫైర్ పెట్టుకున్నాడు.. నిజం తెలిసి తర్వాత కూడా ఆమె భర్త తమ్ముడికి మద్దతుగా నిలిచాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. 

వివరాల మేరకు.. లాతూర్ జిల్లాలోని రింగ్ రోడ్ ప్రాంతంలో నివసిస్తున్న కవల సోదరుల్లో పెద్దవాడికి సమీప ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల అమ్మాయితో ఆరు నెలల క్రితం వివాహం అయ్యింది. కవలలు ఇద్దరు చూడ్డానికి అచ్చం అలాగే ఉంటారు. ఎవరు ఎవరో కూడా గుర్తించడం ఎదుటివారికి కష్టమవుతుంది. అయితే కొత్తగా ఆ కుటుంబంలోకి ప్రవేశించిన ఆ అమ్మాయికి కూడా వారిని గుర్తించలేకపోయింది. 

దీన్నే అవకాశంగా తీసుకున్నాడు ఓ సోదరుడు. తన వదినపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. సోదరుడు లేని సమయంలో తన కోరికను తీర్చుకునేవాడు. ఒకే పోలికతో ఉండటంతో ఆమె అతడిని తన భర్తగానే భావించింది. దాదాపు ఆరు నెలలు ఈ తంతు కొనసాగింది. ఆరు నెలల తర్వాత ఆ యువతి అసలు విషయాన్ని గుర్తించింది. 

జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. అయితే భర్త కూడా తమ్ముడికే వత్తాసు పలికాడు. తమ్ముడితో సంబంధాన్ని కొనసాగించాలని చెప్పాడు. విషయాన్ని వివాదం చేయవద్దని భార్యకు సూచించాడు. అత్తింటివారు కూడా ఈ విషయంలో తమ్ముడికే మద్దతుగా నిలిచారు. దీంతో ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు కవల సోదరులను అరెస్ట్ చేశారు.      

 

Leave a Comment