‘వకీల్ సాబ్’ నుంచి ‘మగువ మగువ’ సాంగ్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తుల విలువను తెలియజేసే విధంగా ఈ సినిమాలోని ‘మగువ మగువ’ ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అందంగా పాడారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Leave a Comment