సన్నీ లియోన్ కి హోం మంత్రి వార్నింగ్..!

ఇటీవల సన్నీ లియోన్ నటించిన పాట వివాదాస్పదమైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ వీడియో ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో మధ్యప్రదేశ్ హోం మంత్రి సన్నీ లియోన్ కి వార్నింగ్ ఇచ్చారు. సన్నీలియోన్ నటించిన ‘మధుబన్ మే రాధికా నాచే’ పాట వీడియోను తీసేయడానికి మూడు రోజులు సమయం ఇస్తున్నానంటూ సన్నీని, గాయకుడు సాకిబ్ తోషిని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారని, ఈ పాట కూడా ఆ కోవకు చెందినదేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాంలో సన్నీ లియోన్, సాకిబ్ తోషి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 72 గంటల్లో ఈ వీడియోను తొలగించకుంటే తగిన చర్యలు తీసుకుంటామనా హెచ్చరించారు. 

ఈ ఆల్బమ్ ని నిషేధించాలని హిందూ పూజారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోను ప్రభుత్వం నిషేధించకపోతే కోర్టుకు వెళ్తామని యూపిలోని బృందావన్ కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ హెచ్చరించారు. ఈ వ్యవహరంలో పాటను విడుదల చేసిన మ్యూజిక్ కంపెనీ ‘సరిగమప’ స్పందించింది. లిరిక్స్ మార్చాలని నిర్ణయించింది. మార్పు చేసిన లిరిక్స్ తో పాటు, పాట పేరును కూడా మారుస్తామని పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో అన్ని వేదికల్లోనూ మార్పు చేసిన లిరిక్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది.  

 

Leave a Comment