జూలై 5న చంద్ర గ్రహణం

2020 లో అన్ని విశేషాలే జరుగుతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా రెండు గ్రహణాలు కనిపించగా, ఇప్పుడు మూడో గ్రహణం కనిపించబోతోంది. జూన్ 5న మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. తర్వాత జూన్ 21న సూర్యగ్రహణం ఏర్పడింది. జూలై 5న మరోసారి చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఇది ఈ సంవత్సరంలో మూడో గ్రహణం అవుతుంది. దీనిని ప్రచ్ఛాయ చంద్రగ్రహణం అంటారు.  

ఈ చంద్ర గ్రహణం జూలై 5న ఉదయం 8.37 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత ఇది 9.59 గంటలకు గరిష్ట ప్రభావంతో ఉంటుంది. ఉదయం 11.22 గంటలకు చంద్ర గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం సుమారు రెండు గంటల 43 నిమిషాల 24 సెకన్ల పాటు ఉంటుంది.

ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మరియు అంటార్కిటికాలో కనిపిస్తుంది. ఈ గ్రహణం యొక్క మొత్తం సమయం మూడున్నర గంటలు ఉంటుంది.  

గ్రహణ నియమాలు పాటించాలా? వద్దా?

ప్రచ్ఛాయ చంద్రగ్రహణం మన ఇండియాలో కనపడదు కాబట్టి..గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. ఇవి కంటికి కనిపించవు కాబట్టి ప్రచ్ఛాయ చంద్రగ్రహణాలను హిందూ ఆచారాల ప్రకారం లెక్కలోకి తీసుకోరు. కేవలం సంపూర్ణ, పాక్షిక చంద్ర గ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి. ఈ గ్రహణం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. 

Leave a Comment