LPG గ్యాస్ సబ్సిడీ ఆన్ లైన్ లో చెక్ చేసుకోవడం ఎలా ?

LPG SUBSIDY AMOUNT STATUS CHECK IN ONLINE 

భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా PAHAL స్కీమ్ ద్వారా అన్ని రకాల గ్యాస్ సబ్సిడీని నేరుగా మన అకౌంట్ కు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంవత్సరానికి 12 సబ్సిడీ సిలిండర్లను వినియోగదారులకు అందజేస్తోంది. ఈ సబ్సిడీ పొందడానికి వినియోగదారుల సంవత్సర ఆదాయం రూ.10 లక్షల కంటే తక్కువ ఉండాలి. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు గ్యాస్ సబ్సిడీ పొందేందుకు అర్హులు కారు. 

అయితే ప్రస్తుతం గ్యాస్ వినియోగస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దీంతో రాయితీ ఇస్తున్న శాతం కూడా పెరిగిపోతోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుంది. ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు భారత ప్రభుత్వం కొత్త మార్గాన్నితీసుకొచ్చింది. గ్యాస్ సబ్సిడీ వద్దు అనుకునే వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. దీనికి ప్రతి స్పందించిన ప్రజలు దాదాపు 1.05  కోట్ల కుటుంబాలు తమ యొక్క LPG గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా తొలగించుకున్నారు.

ఈ సబ్సిడీని పొందుతున్న వారిలో చాలా మంది పేద కుటుంబాలే ఉన్నాయి. దీంతో వారు గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీ అకౌంట్ లో పడిందా లేదాన అని చాలా మంది సందేహంతో ఉన్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సీడీ మన అకౌంట్ లో జమ అయిందో లేదో ఇప్పుడు సులభంగా తెలుసుకుందా..

LPG గ్యాస్ సబ్సిడీ పొందడం ఎలా..

కేంద్ర ప్రభుత్వం PAHAL అనే పథకం ద్వారా గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీని నేరుగా అకౌంట్ కు బదిలీ అయ్యే సదుపాయాన్ని కల్పించింది. ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికి రెండు రకాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆధార్ కార్డు ద్వారా, రెండు ఆధార్ కార్డు లేకుండా. 

ఆధార్ కార్డు ద్వారా LPG గ్యాస్ సబ్సిడీ పొందే విధానం..

దీని కోసం సబ్సిడీ పొందే లబ్ధిదారుడి ఆధార్ కార్డు నెంబర్ ను గ్యాస్ కంపెనీ యొక్క కార్యాలయంలో ఎంటర్ చేయాలి. అయితే ఈ ఆధార్ కార్డు నెంబర్ బ్యాంకు ఖాతాకు లింక్ చేయబడి  ఉండాలి. 

ఆధార్ కార్డు లేకుండా…

ఆధార్ కార్డు లేని వారు రెండు వేరు వేరు వివరాలను LPG గ్యాస్ డీలర్ కు అందజేసి గ్యాస్ రాయితా డబ్బులు పొందవచ్చు. ఆధార్ కార్డు లేని వ్యక్తి అతని పేరు, అకౌంట్ నెంబర్, మరియు ఆ బ్యాంక్ యొక్క IFSC కోడ్ వంటి పూర్తి సమాచారాన్ని LPG గ్యాస్ డీలర్ కు అందజేయాలి. 

LPG Gas Registrtion Online

మీరు మొదటి సారి మీ గ్యాస్ సబ్సిడీని ఆన్ లైన్లో చెక్ చేయాలి అనుకుంటే, మొదటి మీరు రిజిస్ట్రేషన్ ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సమయంలో ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఖచ్చితంగా తెలిసిఉండాలి.

  • ముందుగా My Lpg సైట్ లోకి వెళ్లాల్సి ఉంటంది. అక్కడ మీ గ్యాస్ కనెక్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

  • ఇక్కడ టాప్ లో New User ఆప్షన్ ను క్లిక్ చేయండి.

  • ఇక్కడ మీ పూర్తి వివరాలు ఇవ్వండి. అంటే 17 అంకెల LPG ID ద్వారా రిజిస్టర్ కావచ్చు. లేదా స్టేట్, డిస్ట్రిబ్యూటర్, కన్స్యూమర్ నెంబర్ ఇచ్చి చివరలో మీ ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ కావచ్చు. 
  • ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి Submit చేయండి. 
  • ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్ ని సెట్ చేయమని అడుగుతుంది. 
  • తరువాత మీ మెయిల్ కు ఒక Activation Link వస్తుంది. దానిని క్లిక్ చేసి ప్రొసెస్ పూర్తి చేయండి. 

HOW TO LOGIN IN LPG GAS SITE..

  • ఇప్పుడు మళ్లీ My Lpg సైట్ లోకి వచ్చి Sign in పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఇచ్చి Captcha ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • తరువాత పాస్ వర్డ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు సైట్ లోకి లాగిన్ అవుతారు. 
  • అక్కడ మీ పూర్తి వివరాలు కనబడతాయి. అందులో మీ ఆధార్ సీడింగ్ అయిందో లేదో చూడవచ్చు. 
  • తరువాత ఇక్కడ Track Your Refill ఆప్షన్ని సెలెక్ట్ చేయండి.

  • ఇప్పుడు మీ గ్యాస్ కి సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి. అంటే మీరు గ్యాస్ ఎప్పుడు బుక్ చేశారు, ఎప్పుడు డెలివరీ అయింది, ఎంత అమౌంట్ కట్టారు తదితర వివరాలు కనబడతాయి. 
  • చివరలో Subsidy Amount, Payment Status ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీ బ్యాంకు కు డబ్బు జమ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. 

CLICK HERE :- https://my.ebharatgas.com/bharatgas/UjjwalaBeneficary/Index

 

Leave a Comment