రోడ్డు ప్రమాదంలో కుటుంబంలో ఇద్దరిని కోల్పోయా.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్..!

జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో వార్షిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైబరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఒక నటుడిగా రాలేదని, రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయిన కుటుంబ సభ్యుడిగా వచ్చానని పేర్కొన్నారు. 

ఎంత జాగ్రత్తగా వెళ్లినప్పటికీ ఒక ట్రాక్టర్ తప్పు దారిలో వచ్చి ఆగిపోవడంతో తన అన్న జానకీరామ్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందని అన్నారు. అలాగే 33 వేల కిలోమీటర్లు తాతా గారిని క్షేమంగా తీసుకెళ్లిన తన నాన్న హరిక్రిష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారని గుర్తు చేసుకున్నారు. 

ఎంత కఠినమైన నిబంధనలు పెట్టిన ప్రమాదాలు జరగకుండా మానవని, ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధ్యతతో కుటుంబ సభ్యుల కోసం ప్రవర్తించాలన్నారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేర కాబట్టే అమ్మని, గురువుని, సైనికులను, పోలీసులను సృష్టించాడని పేర్కొన్నారు. పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.   

Leave a Comment