పేకాటలో ఓడిపోయి.. ఆటలో భార్యను తాకట్టు పెట్టిన నీచుడు..!

బిహార్ లోని భగల్ పూర్ లో అమానవీయ ఘటన జరిగింది. జూదంలో సర్వం కోల్పోయిన ఓ భర్త నీచానికి ఒడి గట్టాడు. డబ్బులు లేకపోవడంతో తన భార్యను పందెంలో తాకట్టు పెట్టాడు. తన స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో యాసిడ్ పోసి చిత్రహింసలకు గురిచేశాడు. 

బీహార్ లోని భగల్ పూర్ కు చెందిన సోనూ హరిజన్ ఇటీవల కొంత మందితో పేకాట ఆడి ఓడిపోయాడు.  చివరికి తన భార్యను జూదంలో తాకట్టు పెట్టాడు. బెట్ లో ఓడిపోయిన హరిజన్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నెలపాటు వారితో గడపాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. 

అప్పటికీ భర్త బలవంతంతో రెండు, మూడు సార్లు స్నేహితులతో గడిపింది. ఆ తర్వాత ఆమె వారితో గడిపేందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై భర్త యాసిడ్ తో దాడి చేశాడు. తర్వాత ఆమెను బంధించి నెలపైగాన గదిలో ఉంచాడు. ఆమె ఎలాగో అలా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.  

 

Leave a Comment