తెలంగాణలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగింపు.. 6 నుంచి 5 గంటల వరకు సడలింపు..!

కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరోసారి పొడిగించింది. లాక్ డౌన్ మరో పదిరోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటి జరిగింది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లినవారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి మరో గంటపాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు సమయమిస్తారు.. ఆ తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.  అయితే కరోనా అదుపులోకి రాని నియోజకవర్గాల్లో ప్రస్తుత లాక్ డౌన్ కొనసాగుతుంది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడలో ప్రస్తుత లాక్ డౌన్ అమలు చేయనుననారు. 

Leave a Comment