ఈ బుడుతల డ్యాన్స్ చూస్తే ఔరా అనాల్సిందే..!

టాలెంట్ విషయంలో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. టాలెంట్ కు పేద, ధనిక అనే భేదాలు ఉండవు. ప్రస్తుతం సోషల్ మీడియా ఉండటంతో చాలా మంది తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముగ్గురు చిన్నారుల డ్యాన్స్ చూస్తే ఔరా అనాల్సిందే..

నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ముగ్గురు నిరుపేద పిల్లలు తమ డ్యాన్స్ తో అల్లాడించారు. సుస్మితా తన ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయాన్నారు. వారి నవ్వు కల్మషం లేనిది, పరిపూర్ణమైన ఆనందం వారిది. ఐ లవ్ యూ గాయ్స్ అంటూ పేర్కొన్నారు. ఈ బుడుతల స్టెప్పులకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.