దేవుడా.. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిపై పిడుగు.. వీడియో వైరల్..!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ఘటన ఇండోనేషియాలోని జకార్తలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే.. ఓ వ్యక్తి వర్షంలో గొడుగు పట్టుకుని రోడ్డుపై వెళ్తున్నాడు. రోడ్డుపై నడుస్తున్న సమయంలో పిడుగు నేరుగా అతడిపై పడింది. 

అంతే.. కొద్ది క్షణాల పాటు ఆ ప్రాంతంలో నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా మారింది. పిడుగు దెబ్బకు ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాధారణంగా పిడుగు పడితే బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. 

ఆ వ్యక్తిపై పిడుగు పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పిడుగు నేరుగా అతడిపై పడటానికి కారణం ఏమిటని చర్చనీయాంశంగా మారింది. అతడి వద్ద వాకీటాకీ ఉండటమే పిడుగుపాటకు కారణం అయి ఉంటుందని కొదరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం గొడుకు ఉండే లోహపు కడ్డీ పిడుగును ఆకర్షించి ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా పిడుగు ఎప్పుడు ఎక్కడ పడుతుందో చెప్పలేం.. ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండటమే మేలు.. 

Leave a Comment