‘ఉద్యోగాలు ఇవ్వకుంటే నక్సల్స్ లో చేరుతాం’.. రక్తంతో ప్రధాని మోడీకి లేఖ..!

ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ ఓ సివిల్ సర్వీస్ అభ్యర్థి ప్రధాని మోడీకి రక్తంతో లేఖ రాశాడు. కర్ణాటక రాష్ట్రంలో అక్రమాలు జరిగాయని ఎస్ఐ పోస్టుల రాత పరీక్షను అధికారులు రద్దు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని లేఖలో కోరారు. 

ఎంతో కష్టపడి చదివి పరీక్షల్లో పాస్ అయ్యామని, ఉద్యోగం కూడా వచ్చిందని పేర్కొన్నారు. అయితే అక్రమాలు జరిగాయని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో డబ్బులు ఉన్న వారికే ఉద్యోగాలు వస్తున్నాయని, మెరిట్ ఉన్న వారికి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రధాని మోడీ జోక్యం చేసుకుని నిజాయితీగా ఎస్సై పరీక్షలు రాసిన వారికి న్యాయం జరిగేలా చూడాలని, దోషులను శిక్ష పడేలా చూడాలని లేఖలో కోరారు. ఎస్సై పరీక్షను రద్దు చేయడం నిరాశపరిచిందని, తాము మానసికంగా చచ్చిపోయామని అన్నారు. తాము మొత్తం 8 మంది ఉన్నామని, ఉద్యోగాల్లో తమకు న్యాయం జరగకపోతే మావోయిస్టుల్లో చేరుతామని హెచ్చరించారు. అయితే ఈ లేఖలో వారి వివరాలే లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది.   

 

 

 

Leave a Comment