నంది విగ్రహం పెకిలిస్తూ అడ్డంగా బుక్కయ్యారు..!

ఏపీలో గత కొన్ని రోజులుగా విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. అధికార వైసీపీ వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా మత రాజకీయాలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న నంది విగ్రహాన్ని తొలగిస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు అడ్డంగా బుక్కయ్యారు. 

తొలగించిన విగ్రహాన్ని సమీపంలోని మూడు రోడ్ల కూడలిలో ఉన్న సిమెంట్ దిమ్మెపైకి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ నేతల బండారం బయటపడింది. కాగా టెక్కలి.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం..

సంతబొమ్మాళిలోని అతి పురాతన పాళేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 14న నంది విగ్రహం తొలగింపు వివాదాస్పదమైంది. గ్రామస్థులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రతిపక్ష పార్టీ నేతలే నంది విగ్రహాన్ని తరలించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. 

విగ్రహ తరలింపు వెనుక దురుద్దేశం ఉన్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు వెల్లడించారు. గుట్టుగా రోడ్డు మధ్యలో విగ్రహాన్ని పెట్టాలని చూశారని, మొత్తం ఆరుగురిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వారిలో ప్రతిపక్షాలకు చెందిన నలుగురు ఉన్నట్లు డీఐజీ స్పష్టం చేశారు. 

 

Leave a Comment