మహిళా లాయర్ ని రోడ్డుపైనే ఎలా కొట్టాడో వీడియో చూడండి..!

కర్ణాటకలోని బాగల్ కోట్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై అందులోనూ లాయర్ పై నడిరోడ్డుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆ మహిళను కాళ్లతో కొడుతూ, జుట్టు లాగుతూ దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ దాడిని ఎవరూ ఆపడానికి ప్రయత్నించలేదు. పైగా మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు..

మహంతేష్ చోలచగుడ్డ అనే వ్యక్తి లాయర్ సంగీత షిక్కేరి అనే మహిళా లాయర్ పై విచక్షణరహితంగా దాడి చేశాడు. సంగీత పొరుగింట్లోనే ఉండే మహంతేష్ సివిల్ తగాదా విషయంలో పగ పెంచుకున్నాడు. దీంతో రోడ్డుపైనే మహిళ అని చూడకుండా చెంపదెబ్బలు కొడుతూ, కాలితో తన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మహంతేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. గతంలోనూ వీరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంగీత తనను సివిల్ కేసులో ఇబ్బంది పెట్టిందని మహంతేష్ ఆరోపించాడు.  

Leave a Comment