లారా 400 పరుగులు చేసింది ఈ రోజే..

దిగ్గజ వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారా టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది ఈ రోజే. 2004 ఏప్రిల్ 12న ఆంటిగ్వా రిక్రియేషన్ స్టేడియంలో జరిగిన నాలుగు మ్యాచుల సిరీస్ లో నాలుగో టెస్టులో లారా ఇంగ్లండ్ పై 400 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టు మూడో రోజు ఈ ఘనతను సాధించాడు. 

ఇంతకు ముందు టెస్టు క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రికార్డు ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ మాథ్యు హెడెన్ పేరున ఉండేది. హెడెన్ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేశాడు. అయితే అప్పుడు టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు లారా పేరిటనే ఉండేది. లారా రికార్డును హెడెన్ బద్దలు కొట్టాడు. 1994లో విండీస్ బ్యాట్స్ మెన్ లారా 375 పరుగులు చేశాడు.  హెడెన్ బద్దలు కొట్టిన తన రికార్డును తిరిగి 2004 లో 400 పరుగులు చేసి మళ్లీ రికార్డును తన పేరిటి నిలబెట్టుకున్నాడు.

ఆసక్తికరు విషయం ఏంటంటే 1994 లో ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్ షిప్ లో డర్హామ్ పై వార్విక్ షైర్ తరపున అజేయంగా 501 పరుగులు చేసినందుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును లారా కలిగి ఉన్నాడు. 

లారా 2007లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అతను 22,358 పరుగులు మరియు 53 అంతర్జాతీయ సంచరీలతో తన కెరీర్ ను ముగించాడు. టెస్టు మ్యాచ్ లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా తన పేరిట ఉంది. 

Leave a Comment