ప్రియుడిని పెళ్లి చేసుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ..!

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ.. తెలుగు, తమిళ సినీమాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే విద్యుల్లేఖ ఇటీవల తన శరీరాకృతిపై దృష్టి పెట్టి జిమ్ లో కసరత్తులు చేసింది. బరువు తగ్గించుకుని స్లిమ్ గా తయారైంది.

ఈక్రమంలో ఫిట్ నెస్, న్యూట్రిషన్ ట్రైనర్ సంజత్ తో ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 26న సంజయ్ ను సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో విద్యుల్లేఖ ప్రకటించింది. తాజాగా సెప్టెంబర్ 9న వివాహ బంధంతో వీరద్దిరు ఒక్కటయ్యారు. 

కరోనా నిబంధనల ఉండటంతో కొద్ది మంది బంధుమిత్రల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.    

 

Leave a Comment