మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా సార్? ఆన్ లైన్ క్లాసుల్లో ఉపాధ్యాయున్ని ఆటాడుకున్న విద్యార్థులు..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆన్ లైన్ క్లాసుల్లో ఓ ఉపాధ్యాయుడ్ని విద్యార్థులు ఆటపట్టించారు. దీంతో ఆ ఉపాధ్యాయుడి రియాక్షన్ మాటల్లో చేప్పలేనిది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ నిజానికి ఆ ఉపాధ్యాయుడికి ఎదురైన అనుభవం నిజంగా ఎవరికీ జరగకూడదు..

ఏం జరిగిందంటే..ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు క్లాస్ నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో కొందరు విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడిని ఆట పట్టించారు. ఒక విద్యార్థి ‘క్యా ఆప్ కే పేస్ట్ మే నమక్ హై’(మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా) అని అడిగాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడికి పట్టరాని కోపం వచ్చింది. మరి కొందరు విద్యార్థులు కూడా ఆయన్ను ఆట పట్టించడంతో విసుగు చెందిన ఉపాధ్యాయుడు లైవ్ నుంచి తప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

You might also like
Leave A Reply

Your email address will not be published.