ప్రభాస్ పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే మరణించిన కృష్ణంరాజు..!

ప్రముక నటుడు  కృష్ణంరాజు కన్నుమూశారు.. ఆదివారం తెల్లవారుజామును హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు.. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని గతంలో పలు సినీ వేడుకల్లో ఆయన చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే ఆయన మరణించారు.   

హీరో ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణరాజు కుమారుడు. ఆయన నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో 2002 లో ప్రభాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనతికాలంలోనే పెదనాన్న పేరును ప్రభాస్ నిలబెట్టాడు. ప్రభాస్ పెళ్లి చూడాలన్నది తన కోరిక అని కృష్ణంరాజు పలు మార్లు పేర్కొన్నారు. ప్రభాస్ పెళ్లి కంటే సంతోషాన్నిచ్చే అంశం తనకు మరొకటి లేదని, వీలైతే ప్రభాస్ పిల్లలతోనూ కలిసి నటించాలని ఉందని చెప్పేవారు. కానీ ఆ కోరిక తీరలేదు. అలాగే ప్రభాస్ తో భక్త కన్నప్ప సినిమాను రీమేక్ చేయాలన్నది తన కోరిక అని కృష్ణంరాజు పలు మార్లు చెప్పారు. కానీ ఆ కోరిక కూడా తీరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు.

 

 

 

Leave a Comment