వైఎస్ కుటుంబంతో సంబంధాల్లేవు : కొండా సురేఖ

దేశంలో రాజకీయాల్లో విలువల్లేవని, అంతా డబ్బుతోనే నడుస్తోందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం కొండా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చిన ఆమె.. కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ కుటుంబాన్ని కలవలేదని, వారి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేవని అన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీని జగన్‌ వీడినపుడు జగన్‌ వెంట నడిచిన సురేఖ ఆ తర్వాత ఆయనకు దూరమైపోయారు. పార్టీకి రాజీనామా చేాశాక విజయమ్మ, షర్మిలతో కోర్టుకు హాజరైనపుడు మాత్రమే ఒకసారి మాట్లాడానని, అప్పటి నుంచి వైఎస్ కుటుంబ సభ్యులను ఎన్నడూ కలిసింది లేదు మాట్లాడింది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

నిజ జీవితంలో నక్సల్ ఉద్యమం, రాజకీయ ప్రయాణం, లవ్ స్టోరీలను బేస్ చేసుకొని సినిమా తీశారని చెప్పారు. నక్సలైట్లతో కలిసి తెలంగాణ ఉద్యమం చేసిన కెసిఆర్ ఇప్పుడు నక్సలైట్లను అణచివేతకు గురి చేస్తున్నారన్నారు. తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టీఆర్ఎస్ నేతల ఆగడాలు ఉండేవి కావన్నారు.

 

Leave a Comment