ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ గురించి మాట్లాడటం పరమ వేస్ట్ అని, దొంగలు పడిన ఆరు నెలలకు మొరుగుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వరదు ఎప్పుడు వచ్చాయి.. ఎప్పుడు పంటలను పరిశీలిస్తున్నారని మండిపడ్డారు.
లోకేష్ హాఫ్ నాలెడ్జ్ పార్టే కాదు ట్రాక్టర్ కూడా నడపడం రాదని సెటైర్ వేశారు. లోకేష్ నాయకత్వంలో కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా దించాడో అదే విధంగా టీడీపీని కూడా దించుతాడని చెప్పారు. బుద్ధి ఉన్నోళ్లు ట్రాక్టర్ నుంచి పార్టీ నుంచి కూడా దిగిపోవాలని చెప్పారు. లోకేష్ గురించి మాట్లాడటం పరమ వేస్ట్ అని పేర్కొన్నారు.