ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు ప్రస్తావించకుండా.. పోటీ చేసే దమ్ముందా? కొడాలి నాని సవాల్..!

టీడీపీ, జనసేన పార్టీలకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు.. ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు ప్రస్తావించకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, చిరంజీవి ఎంతో కష్టపడి పైకొచ్చారని చెప్పారు. ఒక్కో మెట్టు ఎక్కి పేరు సంపాదించారని, ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలిసిన వ్యక్తులను తెలిపారు. 

చంద్రబాబు మాయమాటలు నమ్మి పవన్ కళ్యాణ్ సొంత అన్నపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్యానించారు. చిరంజీవిపై ఉన్న నమ్మకంతోనూ సినీ పరిశ్రమ సమస్యల పరిష్కార చర్యలు, సినిమా టికెట్ల ధరలను నిర్ణయించాలని ఆయన్నే సీఎం జగన్ కోరారని తెలిపారు. సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలను సీఎం జగన్ దగ్గరకు తీసుకొచ్చి సమస్యలను పరిష్కరించాలని చిరంజీవి కోరారని వివరించారు. 

ఎన్టీఆర్, చిరంజీవిల పేర్లు వాడకుండా ఎన్నికలకు వెళ్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గుండు సున్నాతో సమానమని కొడాలి నాని అన్నారు. పవన్ కళ్యాణ్ కి కనీస పరపక్వత లేదని, రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పీడ విరగడవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవరు అని వ్యాఖ్యానించారు. 

 

Leave a Comment